ఏపీ సీబీసీఐడీ పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి సభాపతిని కలిసిన ఆయన తనను అరెస్టు చేసి, కస్టడీలో పోలీసులు ప్రవర్తించిన తీరును వివరించారు. కాలికి అయిన గాయాలను చూపించారు. అరెస్టు తదనాంతర పరిణామాలపై ఓం బిర్లాకు లేఖ అందించారు.
RAGHURAMA:ఏపీ సీఐడీ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు - ఎంపీ రఘురామకృష్ణ రాజు తాజా వార్తలు
లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. తన అరెస్ట్, తదనాంతర పరిణామాలను ఎంపీ... స్పీకర్‌కు వివరించారు
ఏపీ సీఐడీ పోలీసులపై లోక్‌సభ స్వీకర్‌కు రఘురామ ఫిర్యాదు
ఈ ఘటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏఎస్పీ విజయపాల్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు తాను మాట్లాడేందుకు అరగంట సమయం ఇవ్వాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి:Eatala Resign: తెరాస, ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా!
Last Updated : Jun 3, 2021, 8:18 AM IST