కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడీ భేటీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పీసీసీ కోసం పోటీ పడుతున్న వారిలో కోమటిరెడ్డి కూడా ఉన్నారు.
మాణిక్కం ఠాగూర్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ - తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో దిల్లీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ వర్గాల్లో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.
![మాణిక్కం ఠాగూర్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ mp komtireddy venkatreddy meet with manickam tagore in delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9897038-thumbnail-3x2-komati.jpg)
మాణిక్కం ఠాగూర్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
ప్రధానంగా పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈరోజే దిల్లీ వెళ్లారు. పదవి కోసం ఎవరికివారు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇంకో నలుగురైదురుగు పోటీలో ఉన్నప్పటికీ... వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయనున్నట్టు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.
ఇదీ చూడండి:పోలీస్‌శాఖలో 20వేల పోస్టులు భర్తీ చేస్తాం: హోంమంత్రి
Last Updated : Dec 16, 2020, 1:58 PM IST