అమెరికా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్‌లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారిద్దరిది చరిత్రాత్మక గెలుపు అని అభివర్ణించారు. వారి గెలుపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడతాయని, ఇరు దేశాలు ఆర్థికంగా, భద్రతాపరంగా కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
'బైడెన్ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు బలపడతాయి' - congress mp komatireddy venkat reddy
అమెరికా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్‌లకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారిరువురి చరిత్రాత్మక విజయంతో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షునికి కోమటిరెడ్డి అభినందనలు
హెచ్1బీ వీసా నిబంధనలను సడలించడం ద్వారా విదేశీ విద్యార్థులు, ఉద్యోగులను అమెరికాకు ఆహ్వానిస్తారని విశ్వసిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. తమ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభను గుర్తిస్తారని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి : వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
Last Updated : Nov 10, 2020, 8:42 AM IST