తెలంగాణ

telangana

ETV Bharat / city

'జర్నలిస్టులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలి' - corona effect on journalists

రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలని సీఎం కేసీఆర్​కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ రాశారు. రెండో దశ కరోనాతో పిట్టల్లా రాలుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

mp komatireddy, mp komatireddy venkatreddy, corona effect on journalists
ఎంపీ కోమటిరెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జర్నలిస్టులపై కరోనా ప్రభావం

By

Published : May 10, 2021, 1:39 PM IST

రెండో దశ కరోనాతో పిట్టల్లా రాలుతున్న జర్నలిస్టులకు రాష్ట్ర సర్కార్ అండగా నిలవాలని సీఎం కేసీఆర్​ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కోరారు. జర్నలిస్టులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలని లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

భువనగిరి నియోజకవర్గం చేర్యాలకు చెందిన విలేకరి కరోనాతో మృతి చెందడం బాధగా ఉందని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 100 మంది జర్నలిస్టులు కరోనాకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి సోకి మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details