తెలంగాణ

telangana

ETV Bharat / city

'దుర్గగుడి స్కాంలో.. మంత్రి‌, ఈవోలే అసలు దోషులు'

విజయవాడ దుర్గగుడి స్కాంలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఈవో సురేష్‌బాబు అసలు దొంగలని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోకుండా చిరుద్యోగులను శిక్షించడం తగదన్నారు. ఈవో సురేష్‌.. మంత్రి వెల్లంపల్లికి తొత్తుగా వ్యవహరించారని ఆరోపించారు.

mp kesineni nani
'దుర్గగుడి స్కాంలో.. మంత్రి‌, ఈవోలే అసలు దోషులు'

By

Published : Feb 23, 2021, 7:29 PM IST

విజయవాడ దుర్గగుడిలో అవినీతి కేసులో అసలు దొంగలు ఏపీ మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేష్ బాబు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ఉన్నతాధికారులను బర్తరఫ్ చేయకుండా చిరుద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి గంగాధర్​తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

దుర్గగుడిలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడుల్లో అధికారులు అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంత్రి అవినీతిపై స్పందించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి:బోధన్​ పాస్​పోర్టుల కేసులో ఇద్దరు పోలీసులు అరెస్ట్​: సీపీ సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details