తెలంగాణ

telangana

ETV Bharat / city

MP GVL letter to CM Jagan : ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాసిన ఎంపీ జీవీఎల్.. ఎందుకంటే?​ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

MP GVL letter to CM Jagan : నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు పేరు పెట్టాలని కోరుతూ భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్​ నరసింహారావు... ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖ ద్వారం అని తెలిపారు.

MP GVL letter to CM Jagan , GVL letter
పీ సీఎం జగన్‌కు లేఖ రాసిన ఎంపీ జీవీఎల్

By

Published : Jan 26, 2022, 10:02 AM IST

MP GVL letter to CM Jagan : పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరగా కార్యాచరణ చేపట్టాలని... భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు కోరారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు పేరు పెట్టాలని కోరుతూ ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖ ద్వారం అని తెలిపారు.

నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు పల్నాడు పేరు పెట్టడం ఈ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి తగిన గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా... జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని..సీఎంకు రాసిన లేఖలో జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

పీ సీఎం జగన్‌కు లేఖ రాసిన ఎంపీ జీవీఎల్

ఇదీ చదవండి:మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details