MP Bharat on special status : తెలుగువారై ఉండి భాజపా ఎంపీ జీవీఎల్.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నారని రాజమహేంద్రవరం ఏపీ భరత్ ఆరోపించారు. కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశం తొలగించడానికి జీవీఎల్ కారణం అని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఈనెల 17న జరగనున్న కేంద్ర హోంశాఖ సమావేశం అజెండాలో.. ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కూడా చెప్పారు..
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారని ఎంపీ భరత్ అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై 22 మంది వైకాపా ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించారని భరత్ తెలిపారు. వైకాపా ఎంపీలు మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని పార్లమెంట్లో అన్నారని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,100 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉందన్నారు. ఏపీలో కొత్తగా జాతీయ రహదారులు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచూడండి:తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పు.. ప్రత్యేక హోదా అంశం తొలగింపు