తెలంగాణ

telangana

ETV Bharat / city

Kadapa steel plant: ఆగస్టు నుంచి కడప స్టీల్ పనులు షురూ - తెలంగాణ వార్తలు

ఏపీలో కడప స్టీల్ పనులు ఆగస్టు నుంచి ప్రారంభమవుతాయని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని జమ్మలమడుగు నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Kadapa steel plant, mp avinash reddy
కడప స్టీల్ ప్లాంట్, ఎంపీ అవినాష్ రెడ్డి

By

Published : Jul 10, 2021, 4:03 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా జమ్మలమడుగు శివారులో ఆగస్టు నుంచి ఉక్కు కర్మాగారం(Kadapa steel plant) పనులు ప్రారంభమవుతాయని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్, ఆర్వో ప్లాంట్, క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నుంచి ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

రెండు లేదా రెండున్నర ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ఎస్ఆర్ గ్రూపు నిర్వాహకులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details