తెలంగాణ

telangana

దిల్లీ అల్లర్లపై మోదీ ఎందుకు మాట్లాడరు?: అసదుద్దీన్

తెలంగాణలో ఎన్​పీఆర్​ అమలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్​ విజ్ఞప్తి చేస్తున్నానని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఎంఐఎం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దిల్లీ అల్లర్లపై మోదీ మాట్లాడడం లేదని అసదుద్దీన్​ నిలదీశారు.

By

Published : Mar 1, 2020, 2:36 PM IST

Published : Mar 1, 2020, 2:36 PM IST

asaduddin owaisi
ఎన్​పీఆర్​ అమలుచేయొద్దని కేసీఆర్​కు విజ్ఞప్తి చేస్తున్నా: అసదుద్దీన్​

తెలంగాణలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయొద్దని కేసీఆర్‌కు అసదుద్దీన్ విజ్ఞప్తిచేశారు.ఎంఐఎం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జెండాను అధ్యక్షుడు, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ ఆవిష్కరించారు. ప్రాణం ఉన్నంత వరకు గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. విద్వేష ఉపన్యాసాలు చేస్తున్నానని కేసులు పెట్టినా భయపడనన్నారు.

2020లో దిల్లీ మరో మారణ హోమానికి వేదికయ్యిందని అసదుద్దీన్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత విధ్వంసం జరిగినా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల నుంచి మోదీ పాఠాలు నేర్చుకుని ఉంటారనుకున్నానని ఎద్దేవా చేశారు. చనిపోయిన వారంతా భారతీయులేనని.. బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధుల ఒకనె‌ల జీతం విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్​పీఆర్​ అమలుచేయొద్దని కేసీఆర్​కు విజ్ఞప్తి చేస్తున్నా: అసదుద్దీన్​

ఇవీచూడండి:దిల్లీలో అల్లర్లకు కారణమదే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details