తెరాస, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ అవగాహనకు వచ్చినట్లు పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్ద మధ్యవర్తిగా తయారయ్యారని యావత్ దేశానికి అర్థమైందని విమర్శించారు. పసుపు బోర్డుపై తెరాస ఎంపీ సురేశ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు... కేంద్రమంత్రి సమాధానం చెప్పారన్నారు.
'కాంగ్రెస్‌ను పూర్తిగా తెరాసకు అమ్మేసి ఉత్తమ్ రాజీనామా చేస్తారు'
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్, తెరాస పార్టీలు రాజకీయ అవగాహనకు వచ్చినట్లు పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైందని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెరాసకు అమ్మేసి విజయవంతంగా రాజీనామా చేసిపోతారని ఎద్దేవా చేశారు.
mp arvind fire on uttam kumar reddy
అదే ప్రశ్నను మళ్లీ ఉత్తమ్‌కుమర్ రెడ్డి లోక్‌సభలో లేవనెత్తడం వెనుక ఈ రెండు పార్టీల సత్సంబంధాలు తేటతెల్లమయ్యాయన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నూతన పసుపు, ఇనామ్ మండీలు ఏర్పాటు చేస్తున్నామని పురుషోత్తం రూపాలా స్పష్టం చేశారని తెలిపారు. ఉత్తమ్‌కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెరాసకు అమ్మేసి విజయవంతంగా రాజీనామా చేస్తారని ఎద్దేవా చేశారు.