తెరాస పతనానికి నాంది పడిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. తెరాస పార్టీలో పెద్దఎత్తున ముసలం పుట్టబోతోందని దిల్లీలో జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో భాజపా విజయం కోసం పనిచేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు అర్వింద్ అభినందనలు తెలిపారు. ఎన్ని రకాలుగా భాజపాను అడ్డుకున్నా.. చివరికి గెలుపు జెండా ఎగరేసి తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పారు.
"భాజపాకు 15 వేల నుంచి 20 వేల మెజార్టీ రానుంది. డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామని తెరాస అనుకుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లతో కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారు. నోట్ల కట్టలతో గెలుద్దామనుకున్న కేసీఆర్‌కు ఈ గెలుపు ఓ చెంపపెట్టు. పోలీలసులతో, అధికార యంత్రాంగంతో, డబ్బు ప్రవాహంతో.. భాజపాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెరాస పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. కేసీఆర్ శకం త్వరలోనే ముగియనుంది. కేటీఆరే.. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవనున్నారు. పార్టీలో పెద్దఎత్తున ముసలం పుట్టబోతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రాబోతోంది. బంగారు తెలంగాణ అన్న మాట.. ప్రధాని నరేంద్రమోదీ నాయత్వంలోనే సాధ్యం కానుంది. హుజూరాబాద్‌లో ఈటల గెలుపు.. ఆ నియోజకవర్గంలోని ప్రజలందరి విజయం. భాజపా గెలుపుబావుటా ఎగరేసేందుకు కష్టపడిన ప్రతీఒక్క కార్యకర్తకు నా అభినందనలు." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ.