రాష్ట్రానికి ఎన్ని టన్నుల ఆక్సిజన్ అవసరమో ప్రభుత్వానికి తెలియదని భాజపా ఎంపీ అర్వింద్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, ఐసీయూ బెడ్లు సరిపోవడం లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దోచుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆరోపించారు. కొవిడ్ చికిత్సలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ విఫలం : ఎంపీ అర్వింద్ - mp arvind fires on minister ktr
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంటే.. రాష్ట్ర సర్కార్ చేతులెత్తేయడమే కాకుండా కేంద్రంపై నెపం నెడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కొవిడ్ వ్యాప్తిపై కేసీఆర్ ఒక్క ఉన్నతస్థాయి సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టారు.
ఎంపీ అర్వింద్, భాజపా ఎంపీ అర్వింద్, తెలంగాణ కరోనా వార్తలు
కరోనా కేసులు, మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. వేరే రాష్ట్రాలు.. కరోనా కేసులు, ఆక్సిజన్, మందులపై కేంద్రానికి వాస్తవ సమాచారం ఇవ్వడం వల్లే వారికి సరైన మద్దతు లభిస్తోందని స్పష్టం చేశారు. రెమ్డెసివిర్ విషయంలో కేటీఆర్ మాట్లాడింది వాస్తవమో కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కరోనా పంజా విసురుతుంటే.. చేతులెత్తేయడమే కాకుండా కేంద్రంపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు.
- ఇదీ చదవండి :ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో ప్రధాని కీలక సమావేశం