అంతిమ సంస్కారంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కవర్లలో సీల్ చేసిన నాలుగు మృతదేహాలను చెత్త తరలించే ట్రాక్టర్‌పై శ్మశానవాటికకు తరలించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఈ సంఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
అమానవీయ ఘటన... చెత్త ట్రాక్టర్‌పై శవాల తరలింపు - Kakinada news\
ప్లాస్టిక్ కవర్లలో సీల్ చేసిన నాలుగు మృతదేహాలను చెత్త తరలించే ట్రాక్టర్‌పై శ్మశానవాటికకు తరలించిన ఉదంతం ఏపీలోని కాకినాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
దీనిపై కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌ను వివరణ కోరగా.. వివిధ అనారోగ్య కారణాలతో వారు మృతి చెందారని, మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు జీజీహెచ్ అధికారులు వినతిమేరకు అనుమతిచ్చినట్లు తెలిపారు. మృతదేహాలను ట్రాక్టర్‌పై తరలించిన అంశం తన దృష్టికి రాలేదన్నారు. ఆసుపత్రిలో ఎవరు మృతి చెందినా మహాప్రస్థానం వాహనంలో తరలిస్తామని జీజీహెచ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:రూ. 12కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?