తెలంగాణ

telangana

ETV Bharat / city

సినీ గేయ రచయిత కందికొండకు మరో కష్టం.. సాయం కోసం అభ్యర్థన - songs writer kandhikonda yadagiri need money

రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలతో బయటపడ్డ ప్రముఖ గేయ రచయిత కందికొండకు మరో కష్టం ఎదురైంది. క్యాన్సర్ చికిత్స ప్రభావం కందికొండ వెన్నెముఖపై పడటంతో కొంత భాగం దెబ్బతింది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి దాతల సహాయంతో ప్రాణాలు దక్కించుకున్న కందికొండ... మరింత దుర్భరస్థితిలో కూరుకుపోయారు. వెన్నెముఖ శస్త్రచికిత్స కోసం మరోసారి దాతలు సహాయం చేయాలని ఆయన కుటుంబం అర్థిస్తోంది.

movie-songs-writer-kandhikonda-yadagiri-need-money-for-his-operation
movie-songs-writer-kandhikonda-yadagiri-need-money-for-his-operation

By

Published : Oct 23, 2021, 5:25 AM IST

సినీ గేయ రచయిత కందికొండకు మరో కష్టం.. సాయం కోసం అభ్యర్థన

ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరికి కొండంత కష్టం వచ్చింది. రెండేళ్ల నుంచి కందికొండ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. రెండుసార్లు ఆ మహామ్మారి నుంచి ప్రాణాలతో బయపడ్డారు. కేటీఆర్ సహా సినీ గేయ రచయితలు, దాతల సాయంతో కుటుంబ సభ్యులు కందికొండ ప్రాణాలు రక్షించుకోగలిగారు. కానీ క్యాన్సర్ చికిత్స కందికొండ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. వెన్నెముకలోని సీ1, సీ2 ఎముకలు పూర్తిగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. ఇప్పటికే కందికొండ ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేసిన ఆ కుటుంబం మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది.

ఆదాయం మొత్తం ఆస్పత్రుల ఖర్చుకే..

కందికొండ ఆదాయం మొత్తం ఆస్పత్రులకే ఖర్చు కావడంతో కుటుంబం ధీనావస్థలో పడింది. ఈ నెల 26న అత్యవసరంగా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడం ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. క్యాన్సర్‌పై పోరాడుతూ నెలలుగా ఆస్పత్రిలోనే ఉండటంతో ఖర్చు భరించలేక ఆయన సతీమణి రమాదేవి... ఇంటికి తీసుకొచ్చి వైద్యుల సలహాతో చికిత్స అందించారు. ఇప్పటికీ పైపు ద్వారానే ఫ్లూయిడ్స్ తీసుకుంటూ కందికొండ జీవనపోరాటం సాగిస్తున్నారు.

కందికొండను ఆదుకోండి..

"రెండేళ్లుగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. దాని కోసం రేడియోథెరపీ, ఆపరేషన్​ చేశారు. ఈ రేడియేషన్​ వల్ల.. వెన్నెముకలోని సీ1, సీ2 దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. వాటి కోసం మళ్లీ ఆపరేషన్​ చేయాలంటున్నారు. అందుకు 15 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. ఈ 26న ఆపరేషన్​ చేయాల్సి ఉంది. కందికొండ అభిమానులతో పాటు సినీ పెద్దలు, దాతలెవరైనా.. ఆర్ఠికంగా సాయం చేయాలని కోరుకుంటున్నా." - రమాదేవి, కందికొండ సతీమణి

మళ్లీ కూయవే గువ్వా అంటూ..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లెలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన కందికొండ... 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో చక్రి సంగీత సారథ్యంలో "మళ్లీ కూయవే గువ్వా" పాటతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 20ఏళ్ల ప్రస్థానంలో 1300కుపైగా పాటలు రాసి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. కందికొండ ఆరోగ్య పరిస్థితిని తెలుసున్న ప్రముఖ గేయ రచయితలు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కందికొండకు చేయూత పేరుతో నిధుల సమీకరణ మొదలుపెట్టారు.

మళ్లీ పాటలు రాయాలని...

కందికొండ యాదగిరికి మాతృక, ప్రభంజన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. పాప ఇంటర్ చదువుతుండగా బాబు డిగ్రీ పూర్తైంది. కందికొండకు వెన్నముక శస్త్రచికిత్స విజయవంతం కావాలని, మళ్లీ పూర్వం రోజుల్లోలాగా ఆయన పాటలు రాయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

కందికొండకు సాయం చేయాలనుకుంటే..

  1. గూగుల్‌ పే ఫోన్‌ నం. 8179310687(కందికొండ రమాదేవి)
  2. ఖాతా వివరాలు:

కందికొండ రమాదేవి

135510100174728

IFSC- UBIN0813559

Union bank

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details