తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీనివాసుడి సేవలో .. సినీ నటులు రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దంపతులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, మంచు విష్ణు...
తిరుమల శ్రీవారిని సినీ నటులు రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తితిదే నిర్వహిస్తున్న బాలకాండ పారాయణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి...