అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. జేసీబీతో కూల్చేందుకు వెళ్లి ఓ కుటుంబాన్ని ఖాళీ చేయాలని ఆదేశించగా ముగ్గురు పిల్లలపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఇల్లు కూల్చొద్దని పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం - illegal construction demolition in Hyderabad
అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఓ కుటుంబాన్ని ఆదేశించగా.. ముగ్గురు పిల్లలపై కిరోసిన్ పోసి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. సరైన సమయంలో పోలీసులు అడ్డుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
తమ ఇల్లు కూల్చొద్దని పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
తమకు చాలా ఏళ్లుగా ఇల్లు ఇక్కడే ఉందని... వరదలకు కూలిపోయిన గోడలు మాత్రమే కట్టినట్లు వారు తెలిపారు. అదే ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మరో 4 రూంలను
అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలను కూలగొట్టాల్సిందేనని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు.