ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొండపల్లి మటన్ మార్కెట్ సెంటర్ సమీపంలో నివసించే వారి ఇంట్లో ఉదయం నుంచి ఎవరూ బయటకు రాకపోవడం వల్ల స్థానికులు తలుపులు తెరిచి చూడగా... తల్లి, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
దారుణం: తల్లీబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి - Andhra Pradesh Krishna District Kondapalli Latest News
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అసలేం జరిగింది, ఎందుకు మృతి చెందారు అనే విషయాలపై స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
దారుణం: తల్లీబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి
అది గమనించిన స్థానికులు వెంటనే...ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారికి చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. మరో ఆసుపత్రికి తరలించేలోపే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి :'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'