రాత్రుళ్లు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. జైలు నుంచి జులైలో విడుదలైన నిందితుడు.. మళ్లీ దొంగతనాలు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. - cyberabad police latest news
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి ఇప్పటివరకు 90 చోరీలు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. అతడి వద్ద నుంచి 39 గ్రాముల బంగారం, 829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..
పక్కాగా రెక్కీ నిర్వహించి.. ఇళ్లను ఎంచుకుంటాడని.. నంబర్ ప్లేట్ లేని వాహనం వాహనం వాడుతూ దొంగతనాలు చేస్తున్నాడని వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామన్న సీపీ.. 39గ్రాముల బంగారం, 829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణలో ఆగిన ఈ స్టాంపుల విక్రయం... రిజిస్ట్రేషన్లకు బ్రేక్