తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా.. కొలువెత్తుకెళ్లింది! - most of the youth are loosing their jobs due to corona pandemic

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే..అనేక రంగాలపై పెను ప్రభావమే చూపుతోంది. ముఖ్యంగా యువత ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయేందుకు కారణమవుతోంది. మొత్తంగా దేశంలోని యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది...నెడుతోంది.

most of the youth are loosing their jobs due to corona pandemic
ఉద్యోగాలపై కరోనా ప్రభావం

By

Published : May 21, 2020, 5:39 AM IST

కరోనా ప్రభావం చాలా రంగాలపై పడుతోంది. ఈ మహమ్మారి యువత ఉద్యోగాలను పోగొడుతోంది. మున్ముందు కొలువులు దక్కుతాయన్న నమ్మకమూ లేకుండా చేస్తోంది. ఇది వారిని, వారి కుటుంబాలను క్రమంగా అప్పుల ఊబిలోకి నెడుతోందని, పరిస్థితి కొనసాగితే సరైన ఆహారం తినలేని పరిస్థితికి ఆ కుటుంబాలు చేరుకుంటాయని ఓ సంస్థ సర్వేలో తేలడం ఆందోళనకర పరిణామమే.

లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో 6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 20-29 ఏళ్లలోపు యువతీ, యువకులు ఒక్క ఏప్రిల్‌ నెలలోనే దాదాపు 2.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు.

జాతీయ నిరుద్యోగ రేటు 23.8 శాతానికి చేరింది. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే ఇది దాదాపు 15 శాతం ఎక్కువని, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 86 శాతం మహిళలు ఉన్నారని జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) అధ్యయనంలో తేలింది. ‘‘కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో కార్మిక బలగం కూడా తగ్గింది.

దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కల్పన అవకాశాలు మరింత ఆలస్యం కానున్నాయి. ఉద్యోగాలు పోవడంతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయి. ఇంటి ఖర్చులకు అప్పులు చేయక తప్పడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో వాయిదాలతో కొనుగోలు చేసిన వస్తువులు జప్తునకు వెళ్లే అవకాశాలూ లేకపోలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోని పిల్లలు, వృద్ధులకు సరైన పోషకాలతో కూడిన ఆహారం లభించకుంటే, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి’’ అని నివేదికలో వెల్లడైనట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సర్వేలోని ముఖ్యాంశాలివీ..

పట్టణాలపై అధిక ప్రభావం

  • గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. పట్టణాల్లో సగటు రేటు 26 శాతం. గ్రామాల్లో అది 22.8 శాతం.
  • జాతీయ స్థాయిలో రాష్ట్రాల సగటు పరిశీలిస్తే.. పంజాబ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగ రేటు రెండంకెల లోపు ఉంది. అత్యల్పంగా సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2.3 శాతం లోపే ఉంది. తెలంగాణలో అది 6.2 శాతం.
  • అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో పుదుచ్చేరి, తమిళనాడు, బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌ ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో 29.8, ఏపీలో 20.5, మహారాష్ట్రలో 20.9, మధ్యప్రదేశ్‌లో 12.4 శాతం ఉంది.

ABOUT THE AUTHOR

...view details