తెలంగాణ

telangana

ETV Bharat / city

Black Fungus : కరోనా చికిత్స పొందుతుండగానే సోకుతున్న బ్లాక్ ఫంగస్

కొవిడ్ వైరస్ సోకిన వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడితే వ్యాధి తీవ్రమై కళ్లు, దవడ భాగాలు తొలగించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు అది మరణానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

Black Fungus, Black Fungus cases in telangana
బ్లాక్ ఫంగస్, తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు

By

Published : Jun 14, 2021, 9:53 AM IST

రోనా నుంచి కోలుకోకుండానే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 700 మంది ఫంగస్‌ రోగులు చేరితే వారిలో చాలామంది ఇప్పటికీ కరోనా చికిత్స పొందుతున్న వారేనని వైద్యులు తెలిపారు. ఇటువంటి వారికి ఓ వైపు కొవిడ్‌కు.. మరోవైపు ఫంగస్‌ వ్యాధి నుంచి కోలుకునేలా చికిత్స అందించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్‌ బారిన పడిన వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఫంగస్‌ వ్యాధి తీవ్రమై కళ్లు, దవడ భాగాలను తొలగించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

అలాంటి వారిలో తీవ్రం..

గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీ దేవి ఆస్పత్రుల్లో దాదాపు 2వేల మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు చేరితే అందులో దాదాపు 700 మంది ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. కొవిడ్‌ చికిత్స పొందుతుండగానే ఫంగస్‌ బారినపడ్డారు. ఇలాంటి వారిలో వ్యాధి తీవ్రమవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా ఉండగా బ్లాక్‌ ఫంగస్‌కు గురైన రోగులను గాంధీలో మాత్రమే చేర్చుకుంటున్నారు. కరోనా తగ్గిన తరువాత ఈ వ్యాధి సోకిన వారికి ఈఎన్‌టీ, సరోజినీ దేవీ కంటి ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నారు. కరోనా తగ్గిన తరువాత బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన వారు తొందరగా కోలుకుంటున్నట్లు ఇటీవల పరిశీలనలో వైద్యులు గుర్తించారు. అదే కరోనా చికిత్స పొందుతూ ఫంగస్‌ సోకిన వారిలో అధికంగా ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది.

గాంధీలో కొద్ది రోజులుగా 400 మంది రోగులు చేరితే వీరిలో 200 మందికి ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. వీరిలో కొందరికి పూర్తిగా ఒక కన్ను తొలగించగా మరికొందరికి దవడ భాగం తొలగించాల్సి వచ్చింది. తాజాగా చేరిన మరో 300 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చాలామంది వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతూ చికిత్స తీసుకుంటుండగానే కరోనా బారిన పడుతున్నారు. కొవిడ్‌ వైద్యంలో భాగంగా స్టిరాయిడ్స్‌ వాడాల్సి వస్తోంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గి.. సదరు రోగులు సులభంగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నారు. ఇటువంటి వారిలో మొదటి నాలుగు రోజుల్లో కన్ను మీద తరువాత దవడ మీద ఫంగస్‌ ప్రభావం చూపిస్తోంది. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ ఫంగస్‌ లక్షణాలు బయటపడితే వారిని గాంధీకి పంపిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం వల్ల వ్యాధి ముదిరి గాంధీలో చేరిన వెంటనే ఆపరేషన్‌ చేయాల్సి వస్తోంది. కొందరు చేరేటప్పటికే ప్రాణాలు వదులుతున్నారు.

అప్రమత్తంగా ఉండండి

రోనా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్న రోగులు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం లక్షణాలు కన్పించినా కూడా గుర్తించి వైద్యులను సంప్రదించాలి. రోగుల కంటే వారి కుటుంబీకులు అప్రమత్తంగా ఉండాలి. తొలిదశలో గుర్తిస్తే వెంటనే ఫంగస్‌కు చికిత్స మొదలుపెడితే ఫలితం ఉంటుంది.

-డా.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

ABOUT THE AUTHOR

...view details