ఆజాద్‌పూర్ మండి ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి పండ్లు, కూరగాయలు వస్తాయి. మార్కెట్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని ప్రధాని నిర్ణయించారు. మార్కెట్‌లో అమ్మకందారులు, కొనుగోలుదారులతో మాట్లాడాను. రైతులు, వ్యాపారుల అనుమానాలు నివృత్తి చేస్తున్నాం. మార్కెట్ తెరిచి ఉంచడంపై అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించాం. పండ్ల రవాణాకు సంబంధించి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రాల నుంచి తెచ్చే రైతుల ఉత్పత్తులు ఎక్కడా ఆపకూడదు. గూడ్సు రైళ్లలోనూ రైతులు తమ పంటలు తీసుకురావచ్చు. రైతులు అడిగితే కార్గో విమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. - కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
రైతులు అడిగితే కార్గో విమానాలు ఇస్తాం: కిషన్‌రెడ్డి - కిషన్‌రెడ్డి తాజా వార్తలు
పండ్ల రవాణాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వారి సౌకర్యార్థం దిల్లీలోని ఆజాద్‌పూర్ మండిని 24 గంటలు తెరచి ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు అడిగితే కార్గో విమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్ఫష్టం చేశారు. రవాణాకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే... ప్రభుత్వ హెల్ప్‌లైన్ సంప్రదించాలని సూచించారు.
రైతులు అడిగితే కార్గో విమానాలు ఇస్తాం: కిషన్‌రెడ్డి
పంట రవాణాలో ఇబ్బందులు వస్తే రైతులు.. 14488, 18001804200 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కిషన్‌రెడ్డి సూచించారు.