తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో 2 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు - ఏపీలో పంచాయతీ ఎన్నికలు 2021

ఏపీలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో రెండు కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు ఉన్నతాధికారులు నివేదించనున్నారు.

more-than-two-crore-people-will-be-utilized-their-voting-right-in-the-panchayat-elections-in-ap
ఆంధ్రప్రదేశ్​లో 2 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు

By

Published : Jan 27, 2021, 8:48 AM IST

ఏపీలో 4 దశల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వివిధ కారణాలతో పలు జిల్లాల్లో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కలెక్టర్లతో ఎన్నికల కమిషనరు బుధవారం నిర్వహించే వీడియో సమావేశంలో అధికారులు ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటిని ఎన్నికల కమిషనరు పరిశీలించి తదుపరి ఆదేశాలిస్తారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీల్లోనే అత్యధికంగా 32,52,069 మంది ఓటర్లు ఉన్నారు. 25,35,500 ఓటర్లతో రెండో స్థానంలో గుంటూరు, 23,98,182 ఓటర్లతో మూడో స్థానంలో పశ్చిమ గోదావరి ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details