ఏపీలో 24 గంటల వ్యవధిలో 10,820 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. 24 గంటల వ్యవధిలో 97 కరోనా మరణాలు సంభవించాయి. కరోనాతో ఇప్పటి వరకు 2,036 మంది మృతిచెందారు. కరోనా నుంచి 1,38,712 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 87,112 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 62,912 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఇప్పటి వరకు 24.87 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10,820 కరోనా కేసులు, 97 మరణాలు - ap corona cases

19:25 August 09
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 10,820 కరోనా కేసులు, 97 మరణాలు
జిల్లాల వారీగా మృతులు
గుంటూరు-12, ప్రకాశం-11, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున... అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతిచెందారు. కర్నూలు జిల్లాలో కరోనాతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కరోనాతో ఆరుగురు చొప్పున మృతిచెందారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, విజయనగరం జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతిచెందారు.
జిల్లాల వారీగా కొత్త కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,543 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,399, పశ్చిమ గోదావరి జిల్లాలో 1132, విశాఖ జిల్లాలో 961, గుంటూరు జిల్లాలో 881, అనంతపురం జిల్లాలో 859, చిత్తూరు జిల్లాలో 848, కడప జిల్లాలో 823, నెల్లూరు జిల్లాలో 696, శ్రీకాకుళం జిల్లాలో 452, కృష్ణా జిల్లాలో 439, ప్రకాశం జిల్లాలో 430, విజయనగరం జిల్లాలో 358 కరోనా కేసులు నమోదయ్యాయి.