ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 70వేల 399 మందికి పరీక్షలు నిర్వహించగా....6 వేల 555 మందికి పాజిటివ్ వచ్చింది. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షల 6వేల 790కి పెరిగింది. యాక్టివ్ కేసులు 56 వేల 897గా నమోదయ్యాయి. ఇప్పటివరకు 6లక్షల 43వేల 993 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా 59 లక్షల 48వేల 534 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. మహమ్మారి దెబ్బకు శుక్రవారం 31 మంది మరణించగా...మొత్తంగా 5 వేల 900 మంది ప్రాణాలు విడిచారు.
జిల్లాల వారీగా కేసులు...