తెలంగాణ

telangana

ETV Bharat / city

దోస్త్​: రెండో విడత సీట్లు కేటాయింపు.. 6 వరకు సమయం - telangana degree admissions 2020

దోస్త్​ ప్రక్రియలో భాగంగా రెండు విడత 65,719 సీట్లు కేటాయించినట్లు కన్వీనర్​ లింబాద్రి తెలిపారు. మరో 2 లక్షల 41 వేల 266 డిగ్రీ సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు. మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనట్లు తెలిపారు.

dost_second_phase_allotment
దోస్త్​: రెండో విడత సీట్లు కేటాయింపు.. 6 వరకు సమయం

By

Published : Oct 1, 2020, 10:05 PM IST

రెండో విడతలో 65 వేల 719 డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి తెలిపారు. సీటు వచ్చిన విద్యార్థులు ఈనెల 6లోగా ఆన్​లైన్​లో రిపోర్టు చేసి.. సీటు రిజర్వ్​ చేసుకోవాలని సూచించారు.

రెండో విడతలో 41 వేల 159 మంది కొత్తగా నమోదు చేసుకున్నారన్నారు. రెండో విడతలో 80 వేల 872 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. రెండో విడత కేటాయింపు తర్వాత మరో 2 లక్షల 41 వేల 266 డిగ్రీ సీట్లు మిగిలినట్లు లింబాద్రి పేర్కొన్నారు. మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనట్లు తెలిపారు.

మొదటి విడతలో సీటు వచ్చిన వారిలో లక్ష 7 వేల 645 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి రిజర్వ్ చేసుకున్నారన్నారు.

రైల్వే డిగ్రీ కళాశాలలో..

రాష్ట్రంలో 986 కళాశాలల్లో 4 లక్షల 9వేల 450 సీట్లు ఉండగా.. ఇప్పటి వరకు లక్ష 68 వేల 184 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రైల్వే డిగ్రీ కాలేజీలో 132 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయిపోయినట్లు వెల్లడించారు. యూనివర్సిటీ కళాశాలల్లో 4 వేల 18 సీట్లు ఉండగా.. 124 మాత్రమే భర్తీ కావల్సి ఉందని లింబాద్రి పేర్కొన్నారు.

సగం కూడా భర్తీ కాలే..

రాష్ట్రంలో 123 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 69 వేల 660 సీట్లలో 26 వేల 42 సీట్లు.., 41 ఎయిడెడ్ కళాశాలల్లో 16 వేల 365 సీట్లలో 5 వేల 726 సీట్లు మిగిలి ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 812 ప్రైవేట్ కాలేజీల్లో 3 లక్షల 19 వేల 275 సీట్లు ఉండగా.. వాటిలో సగం కూడా భర్తీ కాలేదన్నారు.

రెండు విడతల తర్వాత 2 లక్షల 9 వేల 374 సీట్లు మిగిలాయన్నారు. దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ఈనెల 5 వరకు.. వెబ్ ఆప్షన్లు ఈనెల 6 వరకు కొనసాగుతాయని లింబాద్రి తెలిపారు.

ఇవీచూడండి:'విద్యార్థులు ఆందోళన వద్దు.. మూడు దశల్లో ప్రవేశాలు'

ABOUT THE AUTHOR

...view details