Monkey Pox: విజయవాడలో మంకీ పాక్స్ కేసు కలకలం స్పష్టించింది. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలో చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారి నమూనాలను సేకరించిన అధికారులు.. పుణె ల్యాబ్‌కు పంపించారు. అనంతరం చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్‌కు తరలించారు.
అది మంకీపాక్స్ కాదు... సాధారణ దద్దుర్లే..: వైద్యులు
Monkey Pox: విజయవాడలో మంకీ పాక్స్ అనే అనుమానంతో.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ చిన్నారి నమూనాలను అధికారులు పుణె వైరాలజీ ల్యాబ్‌కు పింపించారు. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని.. వైద్యులు తేల్చారు. కాగా.. చిన్నారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
monkey fox
అయితే.. చిన్నారికి అనారోగ్యం మంకీపాక్స్ కాదని నిర్ధరించారు. అధికారులు బాలిక నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. నెగటివ్‌గా నిర్ధరణైంది. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్టు కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ తెలిపారు. ఉదయం విజయవాడలో చిన్నారి శరీరంపై కనిపించిన దద్దుర్లు కనిపించగా.. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని వైద్యులు తేల్చారు.
ఇవీ చదవండి:
Last Updated : Jul 17, 2022, 6:28 PM IST