తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే! - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

శునకానికి వానరం కనిపించిందా... ఇక అంతే సంగతులు. తరిమి తరిమి వెంటాడి వేటాడుతుంది. అందుకే కుక్క ఉన్న దరిదాపుల్లోకి కోతి రాదు. దీనికి భిన్నంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులో ఓ కుక్క కోతితో వైరం మరిచి స్నేహం చేస్తోంది.

monkey dog
monkey dog

By

Published : Dec 28, 2020, 8:26 AM IST

కోతులను చూడగానే కుక్కలు అరుస్తూ వెంటాడుతాయి. దీనికి భిన్నంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులో ఓ కుక్క, కోతి వైరం మరిచి తిరుగుతున్నాయి. స్నేహంగా జీవిస్తున్నాయి. కోతి పుట్టిన కొన్ని రోజులకు దాని తల్లి చనిపోయింది. గాయాలతో ఉన్న బుల్లి వానరాన్ని స్థానికంగా కోళ్ల ఫారం నిర్వహిస్తున్న శిరిగిన పాపారావు, వెంకటచౌదరి చేరదీసి చికిత్స చేయించారు.

వారు పెంచుకుంటున్న ఓ శునకం దీన్ని అక్కున చేర్చుకుని తనతోపాటే తిప్పుతోంది. మిగిలిన కోతులను చూసి .. ఈ వానరం కుక్క వద్దే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండూ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి.

ఇదీ చదవండి :సాగు చట్టాలపై సీఎం కేసీఆర్​ తాజా వైఖరిని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

ABOUT THE AUTHOR

...view details