ఏపీలోని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు. గుంటూరు నగరంలోని అడవితక్కెళ్లపాడులో వైకాపా అభ్యర్ధి తరఫున.. ఓటర్లకు ఇంటింటికి తిరిగి డబ్బులు పంపిణీ చేశారు.
ఏపీలో ప్రలోభాల పర్వం.. డబ్బుల పంపిణీ వీడియో వైరల్ - adavitakkellapadu guntur district latest news update
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రానికే ముగిసింది. అభ్యర్ధులు ప్రలోభాలకు తెర తీశారు. గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన కొందరు వ్యక్తులు.. ఓటర్ల లిస్టు పట్టుకొని ఒక ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఈ తతంగాన్నంతా.. కొందరు వీడియో తీశారు.
ప్రలోభాల పర్వం.. డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్
స్థానిక రాజీవ్ స్వగృహ కాలనీలో డబ్బులు పంపిణీ చేస్తుండగా.. కొందరు వీడియో తీశారు. ఓటర్ల జాబితా పట్టుకొని.. ఇంటి వారిగా ఎన్ని ఓట్లు ఉంటే అన్ని వెయ్యి రూపాయలు ఇవ్వటం.. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
- ఇవీ చూడండి :కర్ణాటక ప్రతిపాదన...తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!