తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagananna Vidya Deevena Scheme : విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ

Jagananna Vidya Deevena Scheme : ఎవరూ దొంగిలించలేని ఆస్తి పిల్లలకు ఇవ్వాలంటే.. అది కేవలం విద్యేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేశారు.

Jagananna Vidya Deevena Scheme
Jagananna Vidya Deevena Scheme

By

Published : Mar 16, 2022, 12:13 PM IST

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ

Jagananna Vidya Deevena Scheme : కుటుంబ స్థితిగతులను పూర్తిగా మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉందని ఏపీ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఎవరూ దొంగిలించలేని ఆస్తి పిల్లలకు ఇవ్వాలంటే.. అది కేవలం విద్యేనన్నారు. అందకే విద్యాదీవెన పథకం తనకు ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు సీఎం జమ చేశారు. కళాశాలలకు ఫీజులు చెల్లించేలా.. మూడు నెలలకోసారి విద్యా దీవెన పథకం డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. మొత్తం 10 లక్షల 82 వేల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details