'మొల్నుపిరావిర్ విజయవంతమైతే కరోనా కట్టడిలో అత్యుత్తమ ఫలితాలు' - Molnupiravir drug clinical trials in Yashoda hospital
కొవిడ్ మహమ్మారిపై పోరాడేందు జార్జియాకు చెందిన ఎమోరి యూనివర్సిటీ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ మొల్నుపిరావిర్ క్లినికల్ ట్రయల్స్ రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ ట్రయల్స్ హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో ప్రారంభమయ్యాయి.
!['మొల్నుపిరావిర్ విజయవంతమైతే కరోనా కట్టడిలో అత్యుత్తమ ఫలితాలు' molnupiravir , molnupiravir drug, molnupiravir drug clinical trials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11855609-1011-11855609-1621674775465.jpg)
కరోనా వైరస్ పై సమర్థంగా పనిచేసే ఔషధాల కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. జార్జియాకు చెందిన ఎమోరి యూనివర్సిటీ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ మొల్నుపిరావిర్ ఇప్పటికే రెండు దశల్లో క్లినికల్ ట్రాయల్స్ పూర్తి చేసుకుంది. విదేశాల్లో జరిగిన పరిశోధనల్లో మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది. హైదరాబాద్ సోమాజిగూడాలోని యశోదా ఆస్పత్రిలో మొల్నుఫిరావిర్పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఆ వివరాలపై ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్యతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి...