రాష్ట్రంలో వర్షాలు తగ్గి ఉక్కపోత(Telangana Weather updates) పెరుగుతోంది. గత రెండు రోజులుగా వాతావరణం(Telangana Weather updates)లో తేమ వల్ల ఉక్కపోత పెరుగుతోందని వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకూ వాతావరణం(Telangana Weather updates) ఇదే తరహా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. గాలిలో తేమ సాధారణంకన్నా 13 శాతం అదనంగా ఉంది.
Telangana Weather updates : 'అక్టోబర్ 15వరకు రాష్ట్రంలో ఉక్కపోత తప్పదు'
తెలంగాణలో గత రెండ్రోజులుగా ఉక్కపోత పెరుగుతోంది. వారం రోజులు వరణుడి(Telangana Weather updates) రాకతో వణికిపోయిన నగరవాసులు ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 15 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉష్ణోగ్రత(Telangana Weather updates) సాధారణంకన్నా 2 డిగ్రీలు అదనంగా పెరిగి హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి 24 డిగ్రీలకు చేరింది. ఈ నెల 15వ తేదీ తరవాత నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి వెళ్లిపోతాయని అంచనా. ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శనివారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు స్వల్పంగా కురిశాయి.
గత వారం, పది రోజులు వరణుడి(Telangana Weather updates) ప్రతాపంతో వణికిపోయిన నగర ప్రజలు.. ఇప్పుడు ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. రాత్రిళ్లు ఉక్కపోత మరీ ఎక్కువగా ఉంటోందని వాపోతున్నారు.