హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ పద్ధతుల్లో వెంకట్‌రెడ్డి చేస్తున్న సేద్యం గురించి ప్రధాని మోదీ... మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. శాస్త్ర విజ్ఞానం అంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్న ప్రధాని.... ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి దానిని విస్తృతపర్చాలని చెప్పారు.
హైదరాబాద్ రైతు వెంకట్‌రెడ్డిపై మోదీ ప్రశంసల జల్లు - రైతు వెంకట్‌రెడ్డిపై మోదీ ప్రశంసలు
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ... హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ రైతును ప్రశంసించారు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. శాస్త్ర విజ్ఞానం అంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్న ప్రధాని.... ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి దానిని విస్తృతపర్చాలని చెప్పారు.
modi praised hyderabad farmer chinthala venkat reddy in mann ki baat
దీనికి నిదర్శనంగా రైతు వెంకట్‌రెడ్డిని పేర్కొన్న మోదీ... సాగులో ఆయన సృష్టించిన అద్భుతాలను మన్‌కీ బాత్‌లో వివరించారు. వరి, గోధమల్లో 'విటమిన్-డి' ఉండేలా రైతు వెంకట్‌రెడ్డి ఫార్ములా రూపొందించారన్న ప్రధాని... దీనిపై ఇటీవలే ఆయనకు పేటెంట్ హక్కు లభించిందని గుర్తుచేశారు. వెంకట్‌రెడ్డి కృషిని గుర్తించి గతేడాది పద్మశ్రీతో గౌరవించినట్లు మోదీ గుర్తుచేశారు.
ఇదీ చూడండి:'ఈ పురస్కారం తెలంగాణ అన్నదాతలందరిది'
Last Updated : Feb 28, 2021, 3:47 PM IST
TAGGED:
chinthala venkat reddy