తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ
తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ - తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ వార్తలు
సంక్రాంతి సందర్భంగా కనుమరోజు కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్ధానికి విశేష ప్రాధాన్యత ఉంది. తూర్పుగోదావరి జిల్లా మెుసలపల్లి పంచాయతీ పరిధి జగ్గన్నతోటలో.. ఏకాదశ రుద్రప్రభలతో కొలువుతీరే ప్రభల తీర్థం విశేషాలను వివరిస్తూ శివకేశల యూత్ సభ్యులు.. ప్రధాని మోదీకి పంపిన సమాచారంపై ఆయన స్పందించారు. యువజన సభ్యులకు... ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపారు. కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థానికి... 17వ శతాబ్దం నుంచి ప్రాధాన్యత సంతరించుకుందంటూ పేర్కొన్నారు. జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నాడు కొలువుతీరే ఏకాదశ రుద్రుల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ప్రధాని నుంచి లేఖ రావడం పట్ల యువజన సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ