Models in the city: ఫెమినా మిస్ ఇండియా అందాల సుందరి సినీశెట్టి నగరంలో సందడి చేసింది. ఆమెతో పాటు పలువురు మోడల్స్ హంగామా చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రో గ్రాండే సెంటర్‌ను సినీశెట్టి ప్రారంభించారు. ట్రెండ్‌కు తగిన విధంగా ఉండటమే తన ఫ్యాషన్ అని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ అందాల కీరిటం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు.
నగరంలో సందడి చేసిన అందాల భామలు - హైదరాబాద్ నగరంలో అందాలభామలు
Models in the city నగరంలో సందడి చేసిన మోడల్స్ చేశారు. కుర్రకారును అందాల భామలు ఉర్రూతలూగించారు.హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రో గ్రాండే సెంటర్‌ను ప్రారంభించారు. వివాహాలతో పాటు పండుగలకు ప్రత్యేకమైన పాదరక్షల డిజైన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
పింక్ లీఫ్ వెడ్డింగ్, పండగలకు ప్రత్యేకమైన పాదరక్షల డిజైన్‌లను ఫెమినా మిస్ ఇండియా సుందరిమణులు సినీశెట్టి, రూబల్ షెకావత్, షినాత్ చౌహాన్ కలిసి మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మలంతా ఫోటోలకు పోజులిస్తూ అలరించారు. రాబోయే పెళ్లి , పండుగల సీజన్‌ల కోసం పాదాల అవసరాలకు అనుగుణంగా విస్తృమైన శ్రేణి ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉన్నాయని నిర్వహకులు తెలిపారు. సంగీత్, మెహందీ, రిసెప్షన్, పండగ కాక్‌టెయిల్ పార్టీలకు ఈ సరికొత్త పాదరక్షలు ప్రత్యేక ఆకర్షణగా వీటిని రూపొందించినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: