గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నియమావళిని తప్పక పాటించాలని స్పష్టం చేసింది. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమల్లో ఉంటుందని తెలిపింది. నియమావళిని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
జీహెచ్ఎంసీలో అమల్లోకి ప్రవర్తనా నియమావళి
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయిన దృష్ట్యా... ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఎస్ఈసీ ప్రకటించింది. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమల్లో ఉంటుందని తెలిపింది. నియమావళిని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
model code of conduct for ghmc mayor election
ఎన్నికల ప్రవర్తనా నియమావళి...
- ఎన్నికైన ప్రతినిధులు సంబంధిత రాజకీయ పార్టీలు జారీ చేసిన విప్‌నకు వ్యతిరేకంగా ఓటు చేసేలా ప్రభావితం చేయడం నిషేధం
- ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రభావానికి గురిచేయరాదు.
- పార్టీల విప్ ధిక్కరించేందుకు ప్రోత్సాహకంగా ఎలాంటి పదవి ఇవ్వరాదు.
- అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వారి అధికారాన్ని బహిరంగంగా లేదా రహస్యంగా దుర్వినియోగం చేయరాదు.
- విచారణ సంస్థలు నేరాల నమోదు, ఛార్జిషీట్ల దాఖలు, రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు తదితరాల అమల్లోనూ ఎలాంటి పక్షపాతానికి పాల్పడరాదు.
- రాజకీయపార్టీలు, అభ్యర్థులు ఎన్నికైన ప్రతినిధులతో ఎలాంటి క్యాంపులు నిర్వహించరాదు.
- ఎన్నిక సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం చేయరాదు.
జీహెచ్ఎంసీ నూతన పాలక వర్గం ఈనెల 11 న ప్రత్యేకంగా సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిణిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రతిపాదనలు పంపించారు.