తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజల వద్దకే కూరగాయలు : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి - minister niranjan reddy latest news on mobile raithu bazar vehicles

జంట నగరాల్లో ఏర్పడిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రజల ఇంటి వద్దకే కూరగాయలు అందిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. 56 మొబైల్ రైతుబజార్ల ద్వారా 102 ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

mobile raithu bazar vehicles to peoples at twin cities by niranjan reddy
ప్రజల వద్దకే కూరగాయలు అందిస్తున్నాం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

By

Published : Oct 15, 2020, 5:26 AM IST

భారీ వర్షాలతో కూరగాయల కోసం ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు దృష్ట్యా.. ప్రజల వద్దకే కూరగాయలు అందుబాటులోకి తెస్తున్నామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. జంట నగరాల్లో మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవాళ 56 వాహనాలతో 102 ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

కరోనా సమయం నుంచి పెద్ద ఎత్తున మొబైల్ రైతుబజార్లతో ప్రజలకు చేరువ అయ్యామని పేర్కొన్నారు. వర్షాల దృష్ట్యా వెంటనే స్పందించి వీలైనన్ని ప్రాంతాల్లో మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో వీలైన ప్రతి చోటా మొబైల్ రైతుబజార్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: పక్కింటివాళ్లతో విహారయాత్రకు వెళ్లి... పెద్దవాగులో పిల్లాడు గల్లంతు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details