తెలంగాణ

telangana

ETV Bharat / city

వ్యవసాయశాఖ సరికొత్త ఆలోచన... ఆ వివరాల నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్ - పంటల వివరాల నమోదుకు మొబైల్ యాప్

Mobile App to Crop Details: రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతి రైతు సాగు చేసే పంటల వివరాల నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్​ను ఆవిష్కరించింది. రాబోయే వానాకాలం సీజన్​లో రైతులకు సంబంధించిన అన్ని వివరాలను ఏఈవోలు ఈ యాప్​లో నమోదు చేయాలని వ్యవసాయ కమిషనర్‌ సూచించారు.

Mobile app
Mobile app

By

Published : Apr 24, 2022, 10:11 AM IST

Mobile App to Crop Details: ప్రతి రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ రూపొందించింది. శనివారం హాకా భవన సమావేశ మందిరంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)తో నిర్వహించిన సమావేశంలో ఈ యాప్‌ను వ్యవసాయ కమిషనర్‌ రఘునందన్‌రావు ఆవిష్కరించారు. రాబోయే వానాకాలం సీజన్‌లో రైతులకు సంబంధించిన అన్ని వివరాలను ఏఈవోలు యాప్‌లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రైతులకు చెల్లింపులు, పంటల వివరాల నమోదు వంటి సాధారణ పనులతోనే తమకు సరిపోతోందని... పంటల సాగుకు సంబంధించిన శాస్త్రీయ అంశాలను వారికి చెప్పలేకపోతున్నామని పలువురు ఏఈవోలు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details