తెలంగాణ

telangana

ETV Bharat / city

సమయం ఒకటే.. సర్వీసులు నాలుగు

దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారి మౌలాలి-ఘట్ కేసర్ మధ్య నాలుగు వరుసల రైలు మార్గాన్ని సిద్ధం చేసి మార్చి 11న విజవంతంగా ప్రారంభించారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగమైన ఈ నాలుగు వరుసల రైలు మార్గం నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేశారు.

mmts train
ఎంఎంటీఎస్ రైలు

By

Published : Mar 13, 2020, 3:25 PM IST

అత్యంత చవకైన రవాణా సంస్థగా పేరొందిన ఎంఎంటీఎస్( మల్టీ మోడల్ ట్రాన్స్ ఫోర్ట్ సర్వీస్ ) 121 రైళ్ల సర్వీసులతో హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో సేవలందిస్తోంది. నగర రవాణా వ్యవస్థ విస్తరణలో భాగంగా 84 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ఫేజ్ -2 నిర్మాణం ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన పనులు చేపడుతున్నారు.

డుబుల్ లైన్​కు అదనంగా..

నగరం పడమటి వైపు తెల్లాపూర్-రామచంద్రాపురం మధ్య నూతన రైలు మార్గం నిర్మాణం జరగుతోంది. సిటీకి ఉత్తరం వైపున బొల్లారం-మేడ్చల్ మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఘట్ కేసర్-మౌలాలి మధ్య అందుబాటులో ఉన్న డబుుల్ లైన్​కు అదనంగా.. కొత్తగా మరో రెండు లైన్ల రైలు మార్గం విద్యుదీకరణ, ఆటో మెటిక్ సిగ్నలింగ్ పూర్తిచేశారు.

దక్షిణ మధ్య రైల్వేలోనే..

నగరం తూర్పు, పడమరలను అనుసంధానిస్తూ సికింద్రాబాద్ బైపాస్ స్టేషన్​గా మౌలాలి-సనత్​నగర్ మధ్య 5 స్టేషన్లు.. దక్షిణం వైపు ఫలక్​నుమా-ఉందానగర్ మధ్య స్టేషన్లకు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్​ వికాస్ నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఈ పనులు చేపడుతున్నారు. ఇప్పుడు మౌలాలి-ఘట్ కేసర్ మధ్య రైళ్లు నడపడానికి ఆటోమెటిక్ సిగ్నలింగ్​తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. మౌలాలి-ఘట్ కేసర్ నాలుగు వరుసల రైలు మార్గ సౌకర్యం దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రప్రథమ సెక్షన్​గా పేరు పొందింది.

ఒకే సమయంలో నాలుగు సర్వీసులు..

మౌలాలి-ఘట్ కేసర్ సెక్షన్ ముఖ్యమైన రైలు మార్గం. ఈ సెక్షన్​లో రద్దీని తగ్గించేందుకు, సబర్బన్ రైళ్లను నిర్వహించడానికి రెండు లైన్లు, నాలుగు లైన్ల మార్గంగా మార్చారు. ఈ నాలుగు లైన్లలో రెండు లైన్ల మార్గాన్ని మౌలాలి నుంచి ఘట్ కేసర్​కు.. మరో రెండు లైన్లను ఘట్ కేసర్ నుంచి మౌలాలికి రైలు సర్వీసులను ఒకే సమయంలో నడపడానికి ఉపయోగిస్తున్నారు. ఈ సెక్షన్ పూర్తిగా ఆటోమెటిక్ కాబట్టి ఇంతకు ముందు కంటే అధిక సంఖ్యలో రైళ్లను నడపడానికి దోహదపడుతుంది.

ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగమైన ఈ నాలుగు వరుసల రైలు మార్గం నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేశారు.

ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు

ఇవీ చూడండి:'కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details