సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతిపై అనుమానాలున్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి బి.నర్సయ్య తల్లి శాంతమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు.. ఏపీ ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్‌కాలనీకి మందకృష్ణ వెళ్లారు. ఇటీవల కారు ప్రమాదంలో గాయపడి కోలుకున్న కత్తి మహేష్... అకస్మాత్తుగా మృతి చెందడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
KATHI MAHESH: 'కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి' - latest news in ongole
సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
mmrps-founding-president-manda-krishna-madiga-has-expressed-suspicion-over-the-death-of-film-critic-katti-mahesh
ప్రమాదం తీరు, అందించిన వైద్యం సైతం అనుమానాస్పదంగానే ఉందన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. వైకాపా అధికారంలోకి రావాలని కోరుతూ ప్రతి నియోజకవర్గంలో పర్యటించిన మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ వందనం, భిక్షాలు, రమేశ్, బీఎస్పీ నాయకులు దుడ్డు భాస్కరరావు, పరంజ్యోతి పాల్గొన్నారు.