తెలంగాణ

telangana

ETV Bharat / city

దంపతుల హత్య న్యాయవ్యవస్థ మీద దాడే..: రాంచందర్‌రావు - తెలంగాణ వార్తలు

వామన్‌రావు దంపతుల హత్యను న్యాయవాద వ్యవస్థ మీద దాడిగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. ఈ ఘటనను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Mlc Ramchander rao demanded to be severely punished the culprits
ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి: ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

By

Published : Feb 18, 2021, 12:03 PM IST

న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్‌ దాఖలు చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ హత్య న్యాయ వ్యవస్థ మీద దాడి అని వ్యాఖ్యానించారు. హత్యకు కారణమైన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: న్యాయవాదుల ఆందోళన.. విధుల బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details