ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలతో మభ్యపెడుతోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా కేవలం శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తెరాస ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ప్రకటనలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది: రామచందర్ రావు - ప్రభుత్వ ప్రకటనలపై ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆగ్రహం
ప్రకటనలతో రాష్ట్ర ప్రభుత్వం... ఉద్యోగులను, నిరుద్యోగులను మభ్యపెడుతోందని ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శించారు. విద్యాశాఖలోని అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు.
ప్రకటనలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది: రామచందర్ రావు
ఉద్యోగుల డిమాండ్లేవీ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్న రాంచందర్‌రావు... విద్యాశాఖలో అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. మండల, జిల్లా విద్యాధికారులు లేకుండా విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:'చైనాతో చర్చల్లో అర్థవంతమైన ఫలితం రాలేదు'