ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిలుపు మేరకు హైదరాబాద్ తార్నాక డివిజన్లో ఎమ్మెల్సీ రామచంద్రా రావు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి హాజరయ్యారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ ప్రజలకు ఎమ్మెల్సీ రామచంద్రారావు నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేస్తూ... నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు.
![నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ mlc ramm chandra rao distributed daily commodities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7353252-705-7353252-1590487991894.jpg)
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ గారు నిరుపేదలకు సాయం చేయాలని పిలుపునిచ్చినట్లు వివరించారు. అందులో భాగంగానే తాను పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు వివరించారు.
ఇవీ చూడండి:మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!