తెలంగాణ

telangana

ETV Bharat / city

'కాంట్రాక్టు అధ్యాపకులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి'

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్‌తోపాటు పీఆర్‌సీ త్రిసభ్య కమిటీని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కలిశారు. ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబ పింఛను ఇవ్వాలని కోరారు. కనీస బేసిక్ వర్తింపజేయాలన్నారు.

MLC Narsireddy met the PRC Committee and cs Somesh Kumar at brk bhavan on contract lecturers issue
'కాంట్రాక్టు అధ్యాపకులకు ఎక్స్‌గ్రేషియా, కుటుంబ పింఛను'

By

Published : Jan 30, 2021, 5:01 PM IST

ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబ పింఛను ఇవ్వాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్‌తోపాటు పీఆర్‌సీ త్రిసభ్య కమిటీని కలిశారు.

కాంట్రాక్టు డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్‌ సమస్యలను సీఎస్‌తోపాటు పీఆర్‌సీ త్రిసభ్య కమిటీకి వివరించామని నర్సిరెడ్డి పేర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులకు పీఆర్‌సీ వర్తించినట్లుగానే.. కాంట్రాక్టు అధ్యాపకులకూ కనీస బేసిక్ వర్తింపజేయాలన్నారు. హెచ్‌ఆర్‌ఏ, డీఏతోపాటు ఆరోగ్యకార్డుల సౌకర్యం కల్పించాలన్నారు.

అనుచరులతో కలిసి బీఆర్‌కే భవన్‌కు వచ్చిన నర్సిరెడ్డిని అనుమతి లేదని పోలీసులు మొదట ఆపారు. ఎమ్మెల్సీనైన తనకు అనుమతి ఏముంటుందని నర్సిరెడ్డి ప్రశ్నించారు. కొంత సమయం తర్వాత సీఎస్ కార్యాలయాన్ని సంప్రదించిన పోలీసులు.. కేవలం నర్సిరెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు.

ఇదీ చూడండి: మహాత్ముడికి కాంగ్రెస్‌ నేతల ఘన నివాళి

ABOUT THE AUTHOR

...view details