సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో పురోగతి సాధించిందని ఎమ్మెల్సీ కవిత ఉద్ఘాటించారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధిని సాదించేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలను కోరారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత... హైదరాబాద్ మహానగరంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 విద్యుత్ సరఫరా, కరెంటు, శాంతి భద్రతలు... ఇవన్నీ సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
'బాధ్యతాయుతమైన పార్టీకి ఓటేయండి' - mlc kavitha about hyderabad development
రాజకీయ కుట్రలకు తావివ్వకుండా... బాధ్యతాయుత పార్టీకి మాత్రమే అమూల్యమైన ఓటేసి గెలిపించాలని హైదరాబాదీలను ఎమ్మెల్సీ కవిత కోరింది. ఆరేళ్లలో హైదరాబాద్ సాధించిన పురోగతిని విశ్లేషించుకోవాలని... బలమైన నాయకత్వాన్ని కొనసాగించాల్సి బాధ్యత నగరవాసులపై ఉందని వివరించారు.
'బాధ్యతాయుత పార్టీకి మాత్రమే మీ అమూల్యమైన ఓటేయండి'
హైదరాబాద్ నగరం వరుసగా ఐదేళ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని... ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయన్నారు. హైదరాబాద్లో ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు.... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.