MLC KAVITHA got Covid: ఎమ్మెల్సీ కవిత కరోనా బారిన పడ్డారు. గత రెండు మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ఇవాళ పరీక్ష చేయించుకోగా వైద్యులు కొవిడ్‌గా నిర్ధారించారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ఆరోగ్యంగానే ఉన్నానని కవిత తెలిపారు. ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్న కవిత ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు.
కవితకు కరోనా పాజిటివ్, నేడు మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ - kavita tweet
MLC KAVITHA got Covid: ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దగ్గుతో బాధ పడుతుండటంతో ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోగా.. కొవిడ్‌గా తేలింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కవిత ట్విటర్ ద్వారా తెలిపారు.
MLC KAVITA
అలాగే ఎవరికి వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా వైరస్‌ని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కవిత ఈరోజు మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ కూడా కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.
ఇవీ చూడండి:
Last Updated : Sep 12, 2022, 6:55 PM IST