స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కవిత విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి ప్రకటించారు.
2015లో కవిత చీఫ్ కమిషనర్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. తన మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తానని చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసైతో కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత విస్తరిస్తామన్నారు.