తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన సమానత్వం: కవిత - dalith indian chamber of commerce and industry

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ-డిక్కీ నిర్వహించిన సెమినార్​లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

mlc Kalwakuntla kavitha participated in international women's day celebrations
మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

By

Published : Mar 8, 2021, 1:47 PM IST

Updated : Mar 8, 2021, 5:00 PM IST

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన సమాజంలో సమానత్వం వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ సోమాజిగూడలో దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ-డిక్కీ... ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

మహిళలు అన్ని ప్రధాన రంగాల్లో సత్తా చాటుతారు అనే భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడ్డప్పుడే సమానత్వం వస్తుందని కవిత తెలిపారు. మహిళలు డబ్బు సంపాదించటం నేర్చుకుంటే నిర్ణయాధికారం మహిళలదే అవుతుందని వివరించారు. ఈ భేటీలో దళిత మహిళలను ప్రోత్సహించడానికి డిక్కీ చేస్తున్న కృషిని కవిత అభినందించారు.

ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన సమానత్వం: కవిత

ఇదీ చదవండి:'అతివల విజయాలకు ప్రతీకగా మహిళా దినోత్సవం'

Last Updated : Mar 8, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details