కేసీఆర్ గురించి మాట్లాడేప్పుడు దయచేసి పదాలను జాగ్రత్తగా ఎన్నుకోవాలని... కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెరాస ఒక ప్రజా గొంతుకని, సీఎం కేసీఆర్ ఒక పోరాట యోధుడన్నారు.
పదాలను జాగ్రత్తగా ఎన్నుకోండి ఠాగూర్: కవిత - మాణిక్కం ఠాగూర్‌కు కల్వకుంట్ల కవిత హెచ్చరిక
కేసీఆర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చేసిన విమర్శలను ఎమ్మెల్సీ కవిత తిప్పికొట్టారు. కేసీఆర్ గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పదాలను జాగ్రత్తగా ఎన్నుకోండి ఠాగూర్: కవిత
గత లోక్‌సభ సమావేశాల్లో తెరాస ఎంపీలు... వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా తమకు మద్దతు తెలిపారని కవిత పేర్కొన్నారు. వరద బాధితులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ఆపాలని... ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అధికారిక లేఖ ఎందుకు ఇచ్చిందో హైదరాబాద్ ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:గులాబీ వ్యూహాలు... గ్రేటర్లో విజయానికి సరికొత్త అస్త్రాలు