తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: కవిత - ghmc-2020

ఆర్టీసీకి తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్​లో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో పాల్గొన్నారు.

mlc kalvakuntla kavitha attend to rtc employs meeting on ghmc elections
ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: కవిత

By

Published : Nov 26, 2020, 10:07 PM IST

ప్రభుత్వ సంస్థలను భాజపా ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆర్టీసీ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తుందన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి‌, సమ్మెకాలపు జీతాల కోసం ఏకమొత్తంగా రూ.235 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అమ్ముతోందని విమర్శించారు.

దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారు..

గత ఆరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదు కాబట్టే, దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్​లో అమ్మాయిని అత్యాచారం చేసిన నిందితులపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో షీ టీంలను ఏర్పాటు చేసి మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్​లో ఐదున్నర లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందని, హైదరాబాద్​ను ప్రపంచంలోనే 16వ సురక్షితమైన నగరంగా నిలిపిందని గుర్తు చేశారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడంతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కృత నిశ్చయంతో ఉన్న తెరాస పార్టీకి ఓటేయాలని ఆర్టీసి కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'

ABOUT THE AUTHOR

...view details