తెలంగాణ సాధన కోసం పని చేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలోచించి ఓటెయ్యాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. కేంద్రంలో భాజపా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటికీ తెరాస మద్దతు తెలిపిందని ఆరోపించారు. అవినీతిని కప్పి పుచ్చుకోవడం కోసమే ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ అంటకాగుతున్నారనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకొని .. సర్కారుకు పట్టభద్రులు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
'వాళ్ల మాటలు సర్కారు డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి' - mlc election campaign updates
పీవీ నర్సింహారావును విమర్శించిన పార్టీ నుంచి వాణీ దేవి పోటీ చేయడం బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సర్కారు పూర్తిగా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకొని.. ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని చేసిందన్న జీవన్‌రెడ్డి... ఆయనను విమర్శించిన పార్టీ నుంచి వాణీ దేవి పోటీ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాపనార్ధాలు పెడుతూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెరాస ఓడిపోవటం ఖాయమన్నారు. మంత్రి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని... ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో తరచూ కరెంట్ కోతలున్నాయని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు... ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతున్నాయని ఎద్దేవా చేశారు.